Feb 12,2023 22:13

మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :శాసనమండలిలో ప్రజల వాణిని వినిపించే పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎంఎల్‌సి ఎన్నికల కమిటీ కన్వీనర్‌ ఎం. మోహన్‌ రావు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని నరుకూరు సెంటర్లో జక్కా వెంకయ్య స్మారక సిఐటియు కార్యాలయంలో మండల జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా, సిఐటీయు మండల అధ్యక్షులు ఎస్‌.కె. మస్తానమ్మల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మ్మోహనరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జి. దయాకర్‌ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రానున్న శాసనమండలి ఎన్నికల్లో పిడిఎఫ్‌ తరపున పోటీ చేస్తున్న ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థి పి బాబు రెడ్డి, పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లు రెడ్డిలను గెలిపించాలని కోరారు. ప్రజా పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచే, శాసనమండలిలో ప్రజల వాణిని వినిపించేది పిడిఎఫ్‌ అభ్యర్థులు మాత్రమేనని వారు స్పష్టం చేశారు. సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు వేగూరు వెంకయ్య, కాల్తిరెడ్డి రవణమ్మ, గంధం వెంకటేశ్వర్లు మహేంద్ర, లక్ష్మయ్య అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అధ్యక్షురాలు అనిత, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు రేణుకమ్మ, మధుసూదనమ్మ, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకులు సీనమ్మ, రేవతి, రైతు సంఘం మండల నాయకులు వేగూరు శంకరయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాశన చెన్నయ్య, ఎం. వెంకట శేషయ్య, నరుకూరు సెంటర్‌ ఆటో యూనియన్‌ అధ్యక్షులు నాశిన పరశురామయ్య, పడుగుపాడు రైల్వేగూడ్స్‌ షెడ్‌ ముఠా వర్కర్స్‌ అన్నాబత్తిన శీనయ్య, వెంకటేష్‌, గోపి, వెలిచెర్ల రామచంద్రయ్య, అన్నం శంకరయ్యలు శాసన మండలి ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపునకు కషి చేస్తామని పేర్కొన్నారు. సిఐటియు అనుబంధ సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక, యువజన, మహిళ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.