Feb 14,2023 21:36

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ప్రజాసంఘాల నాయకులు

పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి-కావలి : పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థుల గెలుపునకు స్థానిక రైల్వే క్వార్టర్స్‌ ప్రాంతంలో సిఐటియు, డివైఎఫ్‌ఐ, ఆధ్వర్యంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. అనంతరం పిడిఎఫ్‌ తరఫున పట్టభద్రుల ఎంఎల్‌సిగా పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వరరెడ్డికి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొక్కిరెడ్డి బాబురెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఓటర్లను కలిసి కోరారు.
కార్యక్రమంలో నాయకులు పసుపులేటి పెంచలయ్య, బోగిశెట్టి కిష్టయ్య, కె చెన్నయ్య, సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్‌, డివైఎఫ్‌ఐ నాయకులు పసుపులేటి పెంచలనరసింహం, తదితరులు పాల్గొన్నారు.