Feb 11,2023 21:26

ఫొటో : పెరటి కోళ్లను పంపిణీ చేసిన ఎపిఎం బుజ్జమ్మ

పెరటి కోళ్లు పంపిణీ
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక వైస్‌ఆర్‌ క్రాంతి పథం కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు ఎపిఎం బుజ్జమ్మ పెరటి కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారిత కార్యక్రమంలో భాగంగా మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరచుకునేందుకు, ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు ప్రభుత్వం పెరటి కోళ్ల కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు
. మండలానికి 100 యూనిట్లు రాగా 100మంది లబ్ధిదారులకు 10కోళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా హెచ్‌డి యాంకర్‌ పర్సన్‌ సుబ్బరాజు, సిసిలు, అకౌంటెంట్‌ జరింతాజ్‌ విఒఎలు పాల్గొన్నారు.