కళ్యాణమహోత్సవ దృశ్యం
ప్రజాశక్తి -రాపూరు :మండలంలోని పెంచలకోన క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి వారి నిజరూప దర్శనం,అభిషేకాలు, కళ్యాణ మహో త్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో అసిస్టేంట్ కమిషనర్, కార్యనిర్వ హణ అధికారి కోవూరు జనార్ధన్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా సౌకర్యాలు కల్పించారు.










