Feb 14,2023 21:19

పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో నిందితులు
పేకాట స్థావరంపై దాడులు
కోవూరు:పేకాట స్థావరం పై సెబ్‌ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. పోలీసుల సమాచారం మేరకు.. మండల పరిధిలోని పాటూరు పొలాల్లో పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. సబ్జెడీ శ్రీ లక్ష్మి ఆదేశాల మేరకు కష్ణ కిషోర్‌ రెడ్డి పర్యవేక్షణలో నెల్లూరు జెడి టీం ఎస్‌ఐ బాలకష్ణ తన బందంతో కలిసి దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న14 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 95 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు .వారు వద్ద ఉన్న 11 మొబైల్‌ ఫోన్లను, 9 మోటర్‌ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో సిఐ నరహరి, ఎస్‌ఐ శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ సురేష్‌, వాసు, హరి, విజరు, పౌల్‌, శ్రీనివాసులు, మస్తానయ్య, వివి రాజు, ఎంఆర్‌ కె రాజు, సుమతి, తులసి తదితరులు పాల్గొన్నారు.