Aug 15,2022 23:05

ప్రజాశక్తి-కంకిపాడు
76వ స్వాతంత్ర వేడుకలను జరుపు కుంటున్నప్పటికీ నేటికీ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు స్వాతంత్రం ఫలాలు దక్కక నిస్సహాయ స్థితిలో ఉన్నారని, ప్రజలందరికీ సమాన అవకాశాలు హక్కులు సాధించుకునే దానికోసం మరో స్వాతంత్య్ర పోరాటాన్ని చేయవలసిన అవసరం ఉందని సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఆర్‌ రఘు అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కంకిపాడు మండెపూడి నాగభూషణ్‌ రెడ్డి భవనం వద్ద జరిగిన జెండా ఆవిష్కరణలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై మరింత భారాలు మోపుతూ, పెట్టుబడి దారులకు మరిన్ని రాయితీలు కల్పిస్తోందన్నారు. విచ్చిన్నకర దొరణాలతో విభజించు, పాలించు అనె బ్రిటిష్‌ వాడి సూత్రం ఆధారంగా కులాలు,మతాలు, ప్రాంతీయం, భాష మొదలగు రూపాలలో ప్రజల మధ్య చీలికలు తెస్తుందని ఆయన అన్నారు. ముందుగా పార్టీ సీనియర్‌ నాయకులువెమురి నాగేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లాకమిటీ సభ్యులు పి. రంగారావు, టి నరేష్‌, ఏ ఉషారాణి, వి శివ శంకర్‌, వి మరియుదాసు, కె వెంకటేశ్వరరావు, కే నాంచారయ్య, వి జాన్‌ మోజెస్‌ పాల్గొన్నా రు.