Sep 17,2023 19:16

దుస్తులు అందజేస్తున్న దృశ్వం

ప్రజాశక్తి - కందుకూరు : పేదల సహాయార్థం నిర్వహిస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా కందుకూరు పట్టణంలో ఆదివారం ప్రతి ఇంట్లో దుస్తులు పాత, కొత్తవి వారికి సరిపోనివి, ఉపయోగపడనివి సేకరించి పేదలకు ఐ.ఎఫ్‌.సి ఫౌండేషన్‌ సంస్థ నిర్వాహకులు అందజేస్తున్నారు. మన్నేటికోటలో నివాసం ఉండే వద్ధులకు, పిల్లలకు వాటిని అందజేశారు. ప్రెసిడెంట్‌ సాజిద్‌, సెక్రటరీ షంషేర్‌, ట్రజరర్‌ హఫీజ్‌, ఇంచార్జ్‌ అయూబ్‌ ఖాన్‌ పఠాన్‌, షంషఉద్దీన్‌ పాల్గొన్నారు.