పెనుకొండ : పేదలకు ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని, పేదవాడి ఆకలి తీర్చడమే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అన్నా క్యాంటిన్ ను ఏర్పాటు చేసి రెండవ రోజు పేదలకు 5 రూపాయలకే రుచికర మైన భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సవితమ్మ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత కక్షతో అన్నా క్యాంటీన్లను పూర్తిగా మూసివేశారని విమర్శించారు.రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఐదు మండలాలలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సోమందేపల్లి మాజీ జెడ్పీటీసీ వెంకట రమణ, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు డీవీ అంజినేయుల, రొద్దం మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు అంజినేయులు, త్రివేంద్ర నాయుడు, నంజప్ప, బాబుల్ రెడ్డి వాసుదేవరెడ్డి చిన్నపోతన్న కొనాపురం ప్రసాద్ అంజినాయక్ , వీరచిన్న, చంద్ర, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










