Feb 10,2023 22:20

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

పెనుకొండ : లేపాక్షి గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పెనుకొండ డివిజన్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ వంశీకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ లేపాక్షి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచకుండా ప్రపోజల్‌ పంపించకుండా అన్యాయం చేస్తోందన్నారు. యూనిఫాం, నూనె, సబ్బులు, గుర్తింపు కార్డులు తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి , సిఐటియు నాయకులు తిప్పన్న, వజ్రం నాగప్ప, రవి నాయక్‌, నాగన్న తదితరులు పాల్గొన్నారు.