May 14,2023 21:22
  • కార్మికుల జీవనోపాధిని కాపాడాలి
  • సామాజిక భద్రతా చట్టాన్ని రూపొందించాలి
  • రోడ్డు రవాణా కార్మిక సంఘాల సమన్వయ కమిటీ జాతీయ సదస్సు పిలుపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో రవాణా రంగాన్ని కాపాడాలని, కార్మికుల జీవనోపాధిని కాపాడాలని ఆల్‌ ఇండియా కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఆర్గనైజేషన్స్‌ నేషనల్‌ కన్వెన్షన్‌ పిలుపునిచ్చింది. ఆదివారం నాడిక్కడ సిఐటియు కేంద్ర కార్యాలయం (బిటిఆర్‌ భవన్‌)లో జరిగిన సదస్సుకుకె.కె.దివాకరన్‌ (ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌), ధర్మవీర్‌ చౌదరి (ఎన్‌ఎఫ్‌ఐఆర్‌టిడబ్ల్యు), జయరాజన్‌ (ఎఐసిసిటియు), నాగరాజన్‌ (టిటిఎస్‌ఎఫ్‌) అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఎన్‌ఎఫ్‌ఐఆర్‌టిడబ్ల్యు ప్రధాన కార్యదర్శి నిర్మల్‌ సింగ్‌ ధాలివాల్‌, ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య, ఎఐసిసిటియు నేత ఎస్‌.కె.రారు, టిటిఎస్‌ఎఫ్‌ నేత సంపత్‌ మాట్లాడారు. ఆర్‌.లక్ష్మయ్య ప్రవేశపెట్టిన డిక్లరేషన్‌ను కన్వెన్షన్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. సదస్సుకు అతిథిగా హాజరైన సిఐటియు కార్యదర్శి ఆర్‌.కరుమ్‌లైయన్‌, ఎఐటియుసి ఉపాధ్యక్షుడు గిరి ప్రసంగించారు.

  • సదస్సు నిర్ణయాలు

జూన్‌, జులై నెలల్లో రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించాలనికన్వెన్షన్‌ పిలుపునిచ్చింది. క్విట్‌ ఇండియా దినోత్సవానిు పురస్కరించుకుని ఆగస్టు 9న కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. రవాణా కార్మికులంతా ఆ కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిసదస్సు కోరింది. సెప్టెంబర్‌ రెండో వారంలో అనిు రాష్ట్రాల్లో ప్రాంతీయ స్థాయిలో ప్రదర్శనలు జరపాలని, రాష్ట్రస్థాయిలో సమన్వయ కమిటీ నాయకత్వం సమావేశమై కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉను రోడ్డు రవాణా కార్మికులందరూ పాల్గని కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని సదస్సు విజ్ఞప్తి చేసింది.