Jul 05,2023 17:14
  • ట్రాన్స్పోర్టు రంగం పరిరక్షణకు ప్రభుత్వం 50 వేల కోట్లు కేటాయించాలి.

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ట్రాన్స్పోర్ట్ రంగ పరిరక్షణకై సామాజిక సంక్షేమ చట్టం కావాలని కార్మికులు ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులైన ఆటో. లారీ. లైట్ మోటార్ వెహికల్ స్కూల్ బస్ ఓనర్ల డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేందుకు ట్రాన్స్పోర్ట్ రంగ పరిరక్షణకై ప్రభుత్వం 50 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య రవాణా రంగ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కార్మిక కర్షక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయం నందు ఆటో ,లారీ, లైట్ మోటర్ వెహికల్ ,స్కూల్ బస్ డ్రైవర్ల విస్తృత సమావేశం ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియారోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య, ఆటో యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని  డ్రైవర్ కం ఓనర్ కలిగిన వాహన యజమానులు ప్రభుత్వ విధానాల వల్ల వాహనాలను అమ్ముకునే పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. ప్రవేట్ ఫైనాన్స్ దోపిడీలు కేంద్ర ప్రభుత్వం మోటర్ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం వల్ల అనేక రాష్ట్రాలు వివిధ రకాల చలానాలు జరిమానాలను భారీగా పెంచి చలానా రూపంలో రవాణా రంగం నుంచి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు దండుకుంటున్నాయని వారున్నారు. మరోపక్క ఓలా, ఉబర్ ,రాపిడ్ సంస్థలు రవాణా రంగంలోకి ప్రవేశించి డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల ఓనర్లు డ్రైవర్లుగా మారే పరిస్థితి ఏర్పడింది. చలానా ధరలు, పన్నులు చెల్లించలేక రవాణా రంగాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయను తెలిపారు. తక్షణమే ప్రభుత్వం జీవో 21 రద్దు చేయాలని రవాణా రంగ పరిరక్షణకై 50 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమానికి కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 24, 25 తేదీలలో చెన్నైలో జరుగుతున్న ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్యవర్గ సమావేశంలో రవాణా రంగంపై ప్రభుత్వాలు వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని వారు రవాణా రంగ డ్రైవర్లకు పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు పి.ఎస్. రాధాకృష్ణ ,అంజిబాబు మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు రియాజ్ ,ప్రైవేట్ స్కూల్ బస్ యూనియన్ నాయకులు సిద్దయ్య లు మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ రంగంలోని కార్మిక ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ ప్రభుత్వం కూడా అనేక రకాలైన జీవోలు తీసుకొచ్చి కార్మికుల మీద భారాలు వేయడమే పనిగా పెట్టుకుందని కార్మికులు ఎక్కడా కూడా సంతోషంతో లేరని అనేక విధాలుగా బాధలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహన మిత్ర పథకం కింద ఇస్తున్న పదివేల రూపాయలకు ఒకవైపు ఇస్తూనే మరోపక్క అనేక విధాలైన తప్పిదాలను చూపిస్తూ వేలాది రూపాయలు ప్రభుత్వం దోచుకుంటుందని వారన్నారు. నగరంలో ఆటో స్టాండ్లు ఏర్పాటుచేసి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని కానీ ప్రభుత్వాలు ఆ పని చేయకుండా ఉన్న స్టాండ్లను కూడా తొలగించి కార్మికులను రోడ్ల పైపడేసే విధంగా ప్రభుత్వం తయారైందని వారన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారానికి సెప్టెంబర్ 9, 10  తేదీలలోకర్నూల్ లో జరుగుతున్న ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని 9వ తేదీన వేలాదిమందితో ప్రదర్శన బహిరంగ సభకుఅధిక సంఖ్యలో రవాణా రంగ కార్మికులు పాల్గొనాలని వారుపిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.రాధాకృష్ణ. రవి. కార్యదర్శులు పి. మహమూద్, హుస్సేన్  వలి, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణ. మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు నాయకులు గంగాధర్, రాజు, శివరాం, 
వై వెంకటేశ్వర్లు ఎస్డబ్ల్యుఎఫ్ నాయకులు రాయుడు, సత్యరాజు, ఆటో యూనియన్ నగర నాయకులు  మండల నాయకులు ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు , లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్లు మరియుచిన్న వ్యాపారస్తుల సంఘం కార్యదర్శి మహమ్మద్రఫీ  పాల్గొన్నారు.