Mar 19,2023 21:23

నేడు కలెక్టరేట్‌ వద్ద ధర్నా : ఎస్‌ఎఫ్‌ఐ

రాజంపేట అర్బన్‌ : శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేస్తున్న ఆగడాలను నిరసిస్తూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి పేర్కొన్నారు. ఆదివారం ఆర్‌ఎస్‌ రోడ్డులో గల ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యాసంస్థలు అధిక ఫీజుల వసూళ్లతో తల్లిదండ్రులను నిలువునా దోపిడీ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించి బస్సులలో విద్యార్థులను తరలించి వారి ప్రాణానికే ముప్పు కలిగేలా వ్యవహరిస్తున్నాయని అన్నారు. సరియైన క్రీడా ప్రాంగణం కూడా లేకుండా విద్యార్థుల మానసిక, శారీరక స్థితిగతులతో చెలగాటమాడుతున్నా ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన చెందారు. పుస్తకాలు, యూనిఫామ్‌ పేరుతో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారని విద్యను వ్యాపారంగా మార్చిన వారి ఆగడాలను వెంటనే అరికట్టాలని డిమాండ్‌ చేశారు. రాజంపేట, మదనపల్లి, పీలేరు లోని శ్రీ చైతన్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, నాయకులు కార్తీక్‌, దినేష్‌ పాల్గొన్నారు.