Apr 28,2023 21:16

న్యూఢిల్లీ : విమానాశ్రయాలు, రైల్వేలు, పాన్‌ రికార్డులు, బ్యాంకులు, పాస్‌పోర్టులు, క్రైమ్‌, క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌ (సిసిటిఎన్‌ఎస్‌), టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లు, వాహనాల రిజిస్ట్రేషన్‌ డేటా, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్‌), ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ (ఒఎస్‌ఐఎన్‌టి), కార్పొరేట్‌ వివరాలు, ఇలా మరే ఇతర వివరాలైనా సరే, రియల్‌ టైమ్‌ సమాచారానిు అందించడం ద్వారా వ్యక్తుల, ఇతర సంస్థలపై నిఘాను పెంచడానికి జాతీయ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌ (నాట్‌గ్రిడ్‌) సిద్ధంగా వుందని హిందూ దినపత్రిక తన వార్తా కథనంలో పేర్కొంది.
కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాట్‌గ్రిడ్‌ అభివృద్దిపరిచిన కేంద్రీకృత డేటాబేస్‌, ఆర్థిక, ప్రభుత్వ వ్యవహారాలకు చెందిన ఒక వ్యక్తి లేదాకంపెనీ యొక్క అనిు డిజిటల్‌ వివరాలను తీసుకుంటుంది, ఎక్కడనాు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించగల లక్షణానిు కూడా ఇది అంతర్గతంగా కలిగివుందని ఆ వార్తాపత్రిక పేర్కొంది. ప్రైవేట్‌, ప్రభుత్వ, అధికార డేటాను ఉపయోగించి జరిపే ఈ నిఘా కార్యకలాపాలు రెండు దశల్లో అమలవుతాయి. మొదటి దశలో నాట్‌గ్రిడ్‌, సమాంతర టెలికం కంపెనీలతో, ఎనిుకల కమిషన్‌, ఎయిర్‌లైన్స్‌ డిజిటల్‌ డేటాబేస్‌లతో ఏకీకృతమవుతుంది. వీటిమధ్య సంబంధాలు నెలకొను తర్వాత, ఒక వ్యక్తి లేదాసంస్థకుసంబంధించిన పూర్తి, సమగ్ర వాస్తవిక సమాచారానిు 39 కేంద్ర, రాష్ట్ర సంస్థలకు నాట్‌గ్రిడ్‌ అందచేయగలుగుతుంది. పాన్‌ రికార్డులు, క్రెడిట్‌ కార్టు వివరాలతో సహా బ్యాంక్‌ సదుపాయాలు, పాస్‌పోర్టులు, కంపెనీ వివరాలు, రైల్వే సరుకురవాణా, ఇమ్మిగ్రేషన్‌, వాహనాల రిజిస్ట్రేషన్‌, ఎన్‌పిఆర్‌ డేటా ఇవనీు ఇప్పటికే ఒక క్లిక్‌తో కేంద్ర, రాష్ట్ర సంస్థలకు అందుబాటులో వునాుయి. ఇక రెండవ దశలో, డేటా విశ్లేషకులు, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి వెబ్‌ బేస్డ్‌ అప్లికేషన్లను సమన్వయ పరిచి, సంపూర్ణమైన డిజిటల్‌ సమాచారానిు జాతీయ భద్రతా ప్రయోజనాలకు అందించగలుగుతారని ఆ వార్తా కథనం పేర్కొంది. కేవలం అధీకృత ప్రభుత్వ కస్టమర్‌కు మాత్రమే ఈ డేటా అందుబాటులో వుంటుందని అధికారులు చెబుతునాురు.