ఇంఫాల్ : మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం కాంగ్సిపోక్పి జిల్లాలో భద్రతా బలగాలను తరలించే రెండు బస్సులకు అల్లరి మూక నిప్పు పెట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అన్నారు. మంగళవారం సాయంత్రం దిమాపూర్ నుండి వస్తుండగా సపోర్మినా వద్ద ఈ ఘటన జరిగింది. మణిపూర్ రిజిస్ట్రేషన్‌తో వస్తున్న బస్సులను ఓ కమ్యూనిటీకి చెందిన బృందం ఆపినట్లు అధికారులు తెలిపారు. మరో కమ్యూనిటీకి చెందిన సభ్యులు ఎవరైనా ఉన్నారా అని సోదాలు చేశారని, అనంతరం బస్సులకు నిప్పుపెట్టారని అన్నారు.