పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించాలని అవుట్‌సోర్సింగ్‌కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు అనుబంధ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డికి గురువారం సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ముఖ హాజరు యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న పిఎఫ్‌ను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గౌస్ లాజామ్, పైపల్లి గంగాద్రి, మున్సిపల్ కార్మికులు పెద్దన్న, రామయ్య, పెద్దన్న, నరసింహులు, నాగార్జున, కేశవ, సాయికుమార్, రామంజి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










