Sep 14,2023 20:04

సాయం అందజేస్తున్న దృశ్యం

సాయం అందజేస్తున్న దృశ్యం
మతుని కుటుంబానికి ఆర్థిక సాయం
ప్రజాశక్తి-వరికుంటపాడు:మండల పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన కాలే వెంకటేశ్వర్లు ఇటీవల రోడ్డు ప్రమాదంలో పెద్దిరెడ్డిపల్లి వద్ద మతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ధర్మవరం గ్రామంలోని యువత పెద్దల సహకారంతో నాలుగు లక్షల 50 వేల రూపాయలు మతుని పిల్లల పేరుపై పెద్దిరెడ్డిపల్లి లోని యూనియన్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేసి ఆ కుటుంబానికి గురువారం యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రవి రెడ్డి, స్థానిక పెద్దల ఆధ్వర్యంలో డిపాజిట్‌ బాండ్‌ ను అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్‌ రవి రెడ్డి మాట్లాడుతూ మంచి సదుద్దేశంతో గ్రామస్తులు చేసిన కషి చాలా గొప్ప పరిణామమన్నారు.
ధర్మవరం గ్రామ ప్రజలు ఇటువంటి కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తారని వారిని యూనియన్‌ బ్యాంక్‌ తరఫున అభినందిస్తున్నామన్నారు. ఆ గ్రామంలో ఎవరికైనా ఆపద వస్తే పార్టీలతో కులాలతో సంబంధం లేకుండా అందరూ ఒక తాటి మీదకు వచ్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గ్రామమే ధర్మవరం గ్రామం అని కొనియాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ తిరుమలరావు, ఫీల్డ్‌ ఆఫీసర్‌ దిలీప్‌, బ్యాంకు సిబ్బంది మల్లి, రమణ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.