ప్రజాశక్తి- తోటపల్లిగూడూరు : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి పర్యావరణను పరిరక్షించాలని మండల ఉపాధ్యక్షులు చెరుకూరు శ్రీనివాసులు నాయుడు సూచించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పినాకిని లయన్స్ క్లబ్, జోనల్ సెక్రెటరీ తాతా కిషోర్, ప్రెసిడెంట్ సునీల్ కుమార్, పినాకిని లయన్స్ క్లబ్ సభ్యులు ఆదివారం తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆములూరు ప్రాథమికొన్నత పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ప్రధానోపాధ్యా యులు షేక్. అహ్మద్ బాషా అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి శ్రీనివాసులు నాయుడు ముఖ్య అతిథి హాజరయ్యారు. అయన మాట్లాడుతూ గ్రామస్తులు సంతోషంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలన్నారు.ఇంకా హెచ్.ఎం. అహ్మద్ బాషా మాట్లాడారు. విద్యార్థులకు మట్టి గణపతి ప్రతిమలను అందజేసిన పినాకిని లయన్స్ క్లబ్, జోనల్ సెక్రెటరీ తాతా కిషోర్, ప్రెసిడెంట్ సునీల్ కుమార్ మరియు పినాకిని లయన్స్ క్లబ్ సభ్యులను హెచ్‌ఎం అహ్మద్ బాషా అభినందించారు. గ్రామ ప్రజలు, యువత, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










