ఎ.కొండూరు : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతోన్మాదంతో దేశ ప్రజలను కులాల వారీగా విడగొడుతూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి చర్యలను అరికట్టాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షురాలు వంకాయలపాటి రాణి అన్నారు. శనివారం మండలంలోని చీమలపాడు గ్రామంలో స్వాతంత్ర అమత ఉత్సవ కార్యక్రమం మండల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం పానెం ఆనందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా పేదరికంలో ఉన్న ప్రజలలో గాని రైతులలో గాని ఎటువంటి ఆర్థిక అభివద్ధి జరగలేదని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థలకి దేశ సంపదను అప్పనంగా దోచిపెడుతున్నారని మత విద్వేషాన్ని ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని కమ్యూనిస్టులు జైలుకు వెళ్లి ప్రాణాలు అర్పించారని ఆమె అన్నారు. అంతకుముందు జాతీయ జెండాను గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు కోలా నాగమణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ గ్రామ అధ్యక్షుడు బెజవాడ శంకర్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు, సిఐటియు మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు ఎస్ రామకష్ణారెడ్డి, సంఘం కార్యదర్శి ఆళ్ళ అమ్మిరెడ్డి, ప్రజానాట్యమండలి నాయకులు పంబి వెంకటేశ్వరరావు, ఎస్ సోములు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు..










