- వన్డే జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా
మెల్‌బోర్న్: భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు(సిఏ)ను ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన 16 మంది ఆటగాళ్ల జాబితాలో పేస్ బౌలర్ పేసర్ రిచర్డ్‌సన్‌తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మిచెల్ మార్ష్‌లు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. వన్డే జట్టుకు కెప్టెన్‌గా పాట్ కమిన్స్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సీనియర్ ఆటగాళ్లు వార్నర్, స్మిత్, లబూషేన్ కూడా జట్టుకు అందుబాటులో ఉండనున్నారు. చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఆస్ట్రేలియా వన్డే జట్టు వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది జరిగే ఐసిసి వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని అత్యుత్తమ జట్టును ప్రకటించినట్లు బెయిలీ వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ కోసం జట్టును సంసిద్ధం చేస్తున్నామని తెలిపారు. మార్చి 17న ముంబైలో, 19న విశాఖలో, 22న చెన్నైలో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.
జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), అబాట్, అగర్, క్యారీ, గ్రీన్, హెడ్, ఇంగ్లిస్, లబూషేన్, మిఛెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, రిచర్డుసన్, స్మిత్, మిఛెల్ స్టార్క్, స్టోయినీస్, వార్నర్, జంపా.










