న్యూఢిల్లీ : భారత బ్యాంకింగ్ రంగంలో మొండి బాకీలు మరింత పెరుగొచ్చని ఎస్అండ్పి గ్లోబల్ రేటింగ్స్ హెచ్చరించింది. వచ్చే 12 - 18 నెలల కాలంలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ)లు 11 శాతానికి ఎగిసే అవకాశం ఉందని ''ది స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఇన్ ఇండియన్ ఫైనాన్సీయల్ ఇన్స్ట్యూషన్స్'' రిపోర్ట్‌లో అంచనా వేసింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మారటోరియం వల్ల ఎన్‌పిఎలు పెరుగొచ్చని పేర్కొంది. 2020 జూన్ 30 నాటికి స్థూల ఎన్‌పిఎలు 8 శాతంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. కాగా ప్రస్తుత, వచ్చే ఏడాదిలో బ్యాంకింగ్ రుణ వ్యయాలు 2.2ా2.9 శాతం భారం కావడం ద్వారా 11 శాతానికి చేరొచ్చని విశ్లేషించింది. అధిక మొండి బాకీల వల్ల బ్యాంక్‌లు సమస్యలను ఎదుర్కోనున్నాయని పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2022ా23 వరకు కూడా విత్త సంస్థలు పటిష్టం కాకపోవచ్చని ఈ రిపోర్ట్ తెలిపింది.
ఇటీవల ఆర్బిఐ కూడా ఎన్‌పిఎల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 2021 మార్చి నాటికి స్థూల మొండి బాకీలు 14.7 శాతానికి చేరొచ్చని పేర్కొంది. జూన్ 30న ఎస్అండ్పి ప్రకటించిన రిపోర్ట్‌లోనూ ఎన్‌పిఎలు 13ా14 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఈ గ్లోబల్ ఎజెన్సీ మంగళవారం విడుదల చేసిన రిపోర్ట్‌లో ఈ అంచనాలను కొంత తగ్గించింది. కాగా ఇటీవల చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రభుత్వం ప్రకటించిన రుణ గ్యారంటీ స్కీమ్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు కొంత పెరుగొచ్చని ఎస్అండ్పి పేర్కొంది. అదే విధంగా 3ా8 శాతం రుణాలు పున్ణర్ వ్యవస్థీకరణకు రావొచ్చని అంచనా వేసింది. ఎన్‌బిఎఫ్‌సిల పరపతి కొంత పెరుగొచ్చని పేర్కొంది.










