Dec 26,2020 21:07

న్యూఢిల్లీ : వచ్చే ఐదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదో అతి పెద్దదిగా అవతరించనుందని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రీసెర్చ్‌ (సిఇబిఆర్‌) అంచనా వేసింది. ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న భారత్‌ 2025 నాటికి బ్రిటన్‌ను వెనక్కి నెట్టనుందని పేర్కొంది. 2019లోనే బ్రిటన్‌ను నెట్టి భారత్‌ ఐదో స్థానంలోకి వచ్చినప్పటికీ ఈ ఏడాది కరోనా దెబ్బతో తిరిగి వెనుకబడిందని సిఇబిఆర్‌ పేర్కొంది. 2030 నాటికి భారత్‌ ఏకంగా మూడో స్థానంలోకి రానుందని అంచనా వేసింది. 2021లో భారత్‌ 9 శాతం, 2022లో 7 శాతం చొప్పున వృద్థిని నమోదు చేసే అవకాశాలున్నాయని తెలిపింది.