మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి -రాపూరు :రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ అప్పాజీ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపిడిఒ అప్పాజీ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుంచి జరిగే జగనన్న వైద్య సురక్ష కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని, వాటర్ ట్యాంకులను పరిశుభ్రం చేయాలన్నారు. టిటిడి కళ్యాణ మండపం నిర్మాణాన్ని ప్రతిపాదనలు పంపుతానని సర్వసభ్య సమావేశం తీర్మానం చేశారు ఎంపిపి ప్రసన్న ఎంపిటిసిలు, సర్పంచులు రాపూరు మండలంలో ఉన్న అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.










