ప్రజాశక్తి - కదిరి టౌన్ : మహనీయుల ఫోటోల ప్రదర్శనలు అభినందనీయమని సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి అన్నారు. కదిరి ప్రముఖ చరిత్ర కారులు శ్రీ సయ్యద్ నసిర్ అహ్మద్ రూపొందించిన చరితార్థుల ఆల్బమ్‌ను జమాతే ఇస్లామి హింద్ , ఆధ్వర్యంలో మున్సిపల్ ఉర్దూ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీనీ వైసిపి రాష్ట్ర సిఇసి సభ్యులు పూల శ్రీనివాసులు రెడ్డి, వైసిపి కదిరి పట్టణ అధ్యక్షులు కె ఎస్ బాహుద్దీన్, వైసిపి రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి లింగాల లోకేశ్వర్ రెడ్డి తిలకించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ కదిరి ప్రతినిధులు డాక్టర్ ఆర్షద్, ఉమ్మర్ ఖాద్రీ, తలుపుల మండల కన్వీనర్ శంకర్, నాయకులు ఆత్మ రెడ్డి,ఉత్త రెడ్డి, మల్లి నాయుడు, ముబారక్, పవనకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










