ప్రజాశక్తి బత్తలపల్లి : మహిళా సంఘాల సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న భారతీ చేయూత మహిళా మార్ట్ ద్వారా మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కురుబ రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్ బాబు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తాడిపత్రి రోడ్ లో మహిళా సంఘాల సభ్యులు 22 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన భారతీ చేయూత మహిళా మార్ట్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న భారతీ చేయూత మహిళా మార్ట్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మహిళా మార్ట్ లో నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, జెడ్పీటీసీకోటి సుధ, ఎంపీపీ గుర్రం వనజ, వైసిపి అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్ రెడ్డి, కమతం ఈశ్వరయ్య జయరాం రెడ్డి, మహిళా మార్ట్ ప్రతినిధులు రామాంజనమ్మ, ప్రభు కుమారి, ఈశ్వరమ్మ, మహిళా సంఘాల సభ్యులు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించాలి : మహిళా సంఘాల సభ్యులందరూ కలిసి షేర్ క్యాపిటల్ ద్వారా ఏర్పాటు చేసుకున్న భారతీ చేయూత మహిళా మార్ట్ ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన భారతీ చేయూత మహిళా మార్ట్‌ను బుధవారం పరిశీలించి మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. మార్కెట్ ధరలకన్నా తక్కువకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను గ్రామీణులకు అందించేందుకు ప్రభుత్వం మరో కార్యాచరణను సిద్ధంచేసిందని, ఇందులో భాగంగా పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో మండలాల వారీగా 'చేయూత' మహిళా సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయనుందని చెప్పారు. దశల వారీగా అన్ని మండలాల్లో మండలానికి ఒకటిన్చొప్పున ఈ మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.










