Jul 18,2021 09:02

ముంబయి : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు చెంబూరు, విఖ్రోలి ప్రాంతాల్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 12 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌ అలెర్ట్‌ విధించిన సంగతి తెలిసిందే. ముంబయిలో శనివారం 156.94 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందనిబృహన్‌ ముంబయి కార్పోరేషన్‌ (బిఎంసి) తెలిపింది. చెంబూరులోని భరత్‌ నగర్‌ నుండి 15 మందిని, విఖ్రోలి సూర్య నగర్‌ నుండి మరో 9 మందిని రక్షించినట్లు పేర్కొంది. రెండు ప్రాంతాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు తెలిపారు.