వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం
మెడికవర్ వైద్యశాలకు అరుదైన గుర్తింపు
-మూడు ఏళ్ళలో వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు
ప్రజాశక్తి-నెల్లూరు:నగరంలోని మెడికవర్ వైద్యశాలకు అరుదైన గుర్తింపు లభించిందని, మూడు ఏళ్లలో వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశామని ఆ వైద్యశాల కార్డియాక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వర్‌రావు తెలిపారు. శనివారం మెడికవర్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ లో జరిగిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం, సహకారంతో , వారిచ్చిన ప్రోత్సాహంతోనే ఇన్ని ఆపరేషన్లు విజయవంతంగా చేయగలిగాం అన్నారు.ఈ సందర్భంగా మెడి కవర్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి ఆద్వర్యంలో వేయి బైపాస్ సర్జరీ లు విజయవంతంగా పూర్తి చేసిన కార్డియాక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వర్ రావు ను ప్రత్యేకంగా శాలువాతో సత్కరించారు.డాక్టర్ బాలకష్ణ, డాక్టర్ జయరాం లను అభినందించారు.ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 1000 గుండె ఆపరేషన్లు చేసిన వైద్య సిబ్బంది సేవలను ప్రశంసించారు. అంతేగాక కేక్ కట్ చేసి ఇందుకు సంబందించిన బ్రోచేర్ విడుదల చేశారు . ఈ కార్యక్రమంలో , సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి,కాన్సర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డి,మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శేఖర్ ,హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.










