ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణంలో మధిర రోడ్డు క్రాస్ వద్ద ఉన్న ఆక్రమణలు తొలగించాలని సిఐటియు ఆధ్వర్యంలో మధిర ఆటో స్టాండ్ కార్మికులు బుధవారం నందిగామ పురపాలక శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ జై రామ్‌కు వినతిపత్రం అందజేశారు .ఈ సందర్భంగా సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గొల్లమూడి ,పల్లగిరి ఆటో స్టాండ్ రిజిస్టర్ చేయించుకొని 100 మంది పైగా ఆటో కార్మికులు జీవనం సాగిస్తున్నారని, అయితే కొంతమంది వ్యక్తులు బడ్డీ కొట్టు, హౌటల్ , చికెన్ సెంటర్ పెట్టి ఆటో ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. అంతే కాకుండా మద్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారని, కావున తక్షణమే మధిర రోడ్డు క్రాస్ వద్ద ఉన్న ఆక్రమణలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ కార్మికులు బాబు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.










