ప్రజాశక్తి - తిరువూరు
మాతభాషపై పట్టుంటే ఇతర భాషలను సులభంగా నేర్చుకోవచ్చని తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షుడు టి.ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక నాగార్జున ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా వికాస సమతి ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ చిన్నచిన్న కథల పుస్తకాలు చదవడం, తెలుగు దిన పత్రికలు చదవటం వల్ల తెలుగు భాషపై పట్టు సంపాదించవచ్చని తెలిపారు. ఏప్రాంతానికి వెళ్లి నప్పటికీ మాతభాషను మరవద్దని సూచించారు. ఈసందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు జె.శివకృష్ణని ఘనంగా సన్మానించారు. ఈకార్యక్ర మంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.నరసిం హారావు, సమితి సభ్యులు ఎం.రాం ప్రదీప్, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.










