న్యూఢిల్లీ : రూ.3.92 లక్షల కోట్ల విలువైన రేడియో వేవ్‌ల కోసం బిడ్డింగ్ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుందని కేంద్రప్రభుత్వం బుధవారం జారీ చేసిన నోటీసులో పేర్కొంది. గతేడాది డిసెంబరు 17న మూలధర వద్ద రూ.3.92 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రం 2,251.25 ఎంహెచ్‌జెడ్ వేలం వేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 12న ప్రీాబిడ్ సమావేశానికి, 28న నోటీసుపై వివరణ కోరడానికి చివరి తేదీని నిర్ణయించింది. వేలంలో పాల్గోవాలనుకునే టెలికాం ఆపరేటర్లు ఫిబ్రవరి ఐదో తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. ఫిబ్రవరి 24న బిడ్డర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్లు పేర్కొంది. 700 ఎంహెచ్‌జెడ్, 800, 900, 2100, 2300, 2500 ఎంహెచ్‌జెడ్‌ల ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో స్పెక్ట్రం కోసం బిడ్లు మార్చి 1 నుంచి ప్రారంభవుతాయని నోటీసులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.










