ప్రజాశక్తి - బనగానపల్లె: పంచాయతీ ఎన్నికల్లో 20వ వార్డు మెంబర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్నభూషి అరుణ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీసీ.జనార్ధన్ రెడ్డి, ఆయన సతీమణి థారు బాక్సింగ్ రాష్ట్ర చైర్మన్ బీసీ.ఇందిరాను పూలమాలలు వేసి సన్మానించారు. బుధవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో టిడిపి మద్దతుపై పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికైన 20వ వార్డు మెంబర్ చిన్నభూషి అరుణ మాజీ ఎమ్మెల్యే బీసీ.జనార్ధన్ రెడ్డి, బీసీ.ఇందిరాకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే బీసీ.జనార్ధన్ రెడ్డి, బీసీ.ఇందిరా, బీసీ.బాల తిమ్మారెడ్డి, బీసీ.రాజామోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి గజమాలతో సన్మానించారు. తెలుగు పేట కాలనీ వాసులు, 13వ వార్డు మెంబర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అత్తార్ అబ్దుల్ కలాం, వారి అనుచరులు మాజీ ఎమ్మెల్యే బీసీ.జనార్ధన్ రెడ్డికి పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు. టిడిపి మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అత్తార్ జావేద్ హుస్సేన్, నాయకులు ఖైరత్ అలీ, జక్కు కిట్టన్న, సురేష్, చిన్న పుల్లయ్య, హరి, రాముడు 13వ వార్డు, 20వ వార్డు, తెలుగుపేట కాలనీ వాసులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బీసీ.జనార్ధన్ రెడ్డి దంపతులను సన్మానిస్తున్న వార్డు మెంబర్లు










