Feb 11,2021 00:07

ఇల్లూరు కొత్త పేట లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న జి.వెంకట రమణ

- ఇల్లూరు కొత్తపేట సర్పంచి అభ్యర్థి వెంకటరమణ
ప్రజాశక్తి - బనగానపల్లె: 
అభివృద్ధి చేసే వారిని ఆదరించి గెలిపించాలని వైసిపి మద్దతుపై పోటీ చేస్తున్న ఇల్లూరు కొత్తపేట సర్పంచి అభ్యర్థి జి.వెంకట రమణ కోరారు. బుధవారం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో గోరంట్ల వెంకటరమణ ఇంటింటికి తిరిగి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సహకారంతో ఇల్లూరు కొత్తపేట గ్రామాన్ని మండలంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒక్కసారి తనను సర్పంచిగా గెలిపించాలని కోరారు. గ్రామంలో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సర్పంచిగా గెలిపిస్తే సేవకునిగా పని చేస్తానని చెప్పారు. గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, తనను గెలిపిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వైసిపి నాయకులు కర్నాటి సురేంద్రబాబు, గోగుల రామ సుబ్బారెడ్డి, కర్రె ఎద్దుల వెంకటసుబ్బా రెడ్డి, రాఘవరెడ్డి, ఎన్నం లక్ష్మిరెడ్డి, చాంద్‌ బాషా, లక్ష్మన్న, జానీ, బండారు చిన్న వెంకటేశ్వర్లు, మునిస్వామి, చంద్రయ్య, మాలి రఘురాముడు, చీకటి ఈశ్వరయ్య, కొమ్ము శివ, చోటు హుస్సేని, తోకల నారాయణ, తోకల లక్ష్మీనరసయ్య, దొడియం హుస్సేన్‌ బాష, ఏడుకొండలు, వెంకటరాముడు, వీరన్న, గులాం నబీ పేట నాయకులు ప్రసాద్‌ రెడ్డి, కె.వెంకటసుబ్బారెడ్డి, భాస్కర్‌ రెడ్డి, సుబ్బారెడ్డి, రఘు, వెంగన్న పాల్గొన్నారు.