Oct 15,2023 15:06

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని నిరుపేద మహిళల పట్ల సీఎం కేసీఆర్‌ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌, కేసీఆర్‌ కింట్‌ వంటి పథకాలను అమలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌.. మరో కొత్త పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ ప్రతినెలా రూ. 3,000 జీవన బృతిని అందిస్తుందని హామీ ఇస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. బీపీఎల్‌ కార్డు కలిగిన వారికి వర్తిస్తాం. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అమలు చేస్తాం అని కేసీఆర్‌ ప్రకటించారు.