- తరగతుల విలీనం వద్దంటూ విద్యార్థుల, తల్లిదండ్రుల ధర్నా
ప్రజాశక్తి - టి.నర్సాపురం : మా బడి మాకే కావాలంటూ మండలంలోని తిరుమలదేవిపేట మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాల ఎదుట విద్యార్థులు, తల్లి తండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు ఘమాట్లాడుతూ గ్రామంలోని ఎస్‌సి కాలనీ ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులు చదివే విద్యార్థులు ప్రాధమికోన్నత పాఠశాలకు వెళ్లాలంటే రెండు చెరువులు, ఒక వాగు దాటి వెళ్లాలని తెలిపారు. గ్రామంలోనే బడి కొనసాగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారి టి.రామమూర్తి, బొర్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.లింగస్వామి సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థుల తల్లి దండ్రులతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆ ందోళన విర మించారు.
ముసునూరు : ముసు నూరు మెయిన్ పాఠ శాలను హైస్కూ ల్‌లో విలీనం చేయవద్ద ంటూ 3, 4, 5 తరగతల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిప్యూటీ తహాశీల్దార్‌కు, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ బసవరాజు అచ్యుత సత్యనారాయణకు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి కాలనీ, ఎస్‌సి ఏరియా మొత్తానికి నడిబోడ్డులో ఉన్న మెయిన్ పాఠశాలను సుమారు కిలోమీటరునర్ర దూరంలో ఉన్న హైస్కూలులో కలుపవద్దని కోరారు. అంత దూరం నడిచి వెళ్లాలంటే స్కూల్ బ్యాగ్ బరువు, ఎప్పడూ రద్దీగా ఉండే రోడ్డు కావడంతో ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో స్కూల్ పుస్తకాలతో పాటు విద్యార్థులు తడిచిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్సందించి మెయిన్ పాఠశాలలో 3,4,5 తరగతులు విలీనం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ చింతా రాంబాబు, జి.తిరుపతమ్మ, టి.వెంకటేశ్వరమ్మ, చింతాలక్ష్మి, సుంకర లక్ష్మి, నక్క నాగమణి పాల్గొన్నారు.










