Apr 16,2023 07:24
  • లక్నోపై రెండు వికెట్ల తేడాతో పంజాబ్‌ విజయం

లక్నో: లక్నో వేదికలో జరిగిన మరో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు రెండు వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 160పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్‌ జట్టు చివరి ఓవర్‌లో గెలిచింది. తొలుత లక్నో కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌(74) అర్ధ సెంచరీతో రాణించగా.. మయర్స్‌(29) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్స్‌ రాణించలేదు. కృనాల్‌ పాండ్యా(18), స్టోయినిస్‌(15) ఆ తర్వాత రెండంకెల స్కోర్‌ చేశారు. దీంతో లక్నో జట్టు 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. శ్యామ్‌ కర్రన్‌కు మూడు, రబడాకు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. మిడిలార్డర్‌ బ్యాటర్స్‌ షార్ట్‌(34), భాటియా(22)కి తోడు సికిందర్‌ రాజా(57) అర్ధసెంచరీతో మెరిసాడు. చివర్లో షారుక్‌(23నాటౌట్‌; 10బంతుల్లో ఫోర్‌, 2సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించి మ్యాచ్‌ను ముగించాడు. దీంతో ఈ సీజన్‌లో పంజాబ్‌ జట్టు మూడో విజయాన్ని సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి చేరింది.

స్కోరు వివరాలు  
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) (సబ్‌) ఎలిస్‌ (బి) అర్షదీప్‌ 74; మేయర్స్‌ (సి) హర్‌ప్రీత్‌ సింగ్‌ (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 29; హుడా (ఎల్బీ) (బి) రజా 2; కృనాల్‌ (సి) షారుఖ్‌ (బి) రబడ 18; పూరన్‌ (సి) షారుఖ్‌ (బి) రబడ 0; స్టొయినిస్‌ (సి) జితేశ్‌ (బి) కరన్‌ 15; బదోని (నాటౌట్‌) 5; గౌతమ్‌ (సి) రజా (బి) కరన్‌ 1; యు«ద్‌వీర్‌ (సి) షారుఖ్‌ (బి) కరన్‌ 0; బిష్ణోయ్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–53, 2–62, 3–110, 4–111, 5–142, 6–150, 7–154, 8–154. బౌలింగ్‌: షార్ట్‌ 2–0–10–0, అర్షదీప్‌ 3–0–22–1, రబడ 4–0–34–2, స్యామ్‌ కరన్‌ 4–0–31–3, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2–0–10–1, రజా 2–0–19–1, చహర్‌ 3–0–28–0.  

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: అథర్వ (సి) అవేశ్‌ (బి) యుద్‌వీర్‌ 0; ప్రభ్‌సిమ్రన్‌ (బి) యుధ్‌వీర్‌ 4; షార్ట్‌ (సి) స్టొయినిస్‌ (బి) గౌతమ్‌ 34; హర్‌ప్రీత్‌ సింగ్‌ (సి) (సబ్‌) ప్రేరక్‌ (బి) కృనాల్‌ 22; రజా (సి) స్టొయినిస్‌ (బి) బిష్ణోయ్‌ 57; కరన్‌ (సి) కృనాల్‌ (బి) బిష్ణోయ్‌ 6; జితేశ్‌ (సి) రాహుల్‌ (బి) వుడ్‌ 2; షారుఖ్‌ (నాటౌట్‌) 23; హర్‌ప్రీత్‌ బ్రార్‌ (సి) పూరన్‌ (బి) వుడ్‌ 6; రబడ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో 8 వికెట్లకు) 161.  
వికెట్ల పతనం: 1–0, 2–17, 3–45, 4–75, 5–112, 6–122, 7–139, 8–153. బౌలింగ్‌: యుద్‌వీర్‌ 3–0–19–2, అవేశ్‌ 3–0–24–0, మార్క్‌వుడ్‌ 4–0–35–2, గౌతమ్‌ 4–0–31–1, కృనాల్‌ 3–0–32–1, రవి బిష్ణోయ్‌ 2.3–0–18–2.