Oct 12,2023 07:52

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బుధవారం రాత్రి కలిశారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారణ పేరుతో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని తెలిపారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును కేసుల పేరుతో ఇబ్బందులు పెట్టడం మంచిది కాదని అమిత్‌షా అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని అన్నారు. అమిత్‌షాను కలిసిన వారిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి, తెలంగాణ అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఉన్నారు.