హైదరాబాద్ : లోక్ క్యాపిటల్ నేతత్వంలో సిరీస్ ఎ ఫండింగ్ రౌండ్‌లో 15 మిలియన్ల డాలర్ల (దాదాపు రూ.120 కోట్లు) నిధులను సమీకరించినట్లు అక్వాకనెక్ట్ వెల్లడించింది. ఈ నిధులతో పుల్ స్టాక్ ఆక్వాకల్చర్ ప్లాట్‌ఫామ్ ఆక్వా పార్ట్‌నర్స్ నెట్‌వర్క్‌ను మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ విస్తరణతో తన దేశీయ మత్స్య మార్కెట్ అనుసంధాన పరిష్కారాలను పెంచడంతో పాటుగా.. చైనా, జపాన్‌లకు ఎగుమతులను వేగవంతం చేయాలని నిర్దేశించుకున్నట్లు తెలిపింది. ఈ సంస్థ ఆక్వాకల్చర్ రైతులు, రిటైలర్లు, సీఫుడ్ కొనుగోలుదారులకు అధికారిక క్రెడిట్, వ్యవసాయ ఇన్‌పుట్‌లు, పోస్ట్-హార్వెస్ట్ మార్కెట్‌లను కల్పిస్తుంది.










