Dec 02,2022 23:07
  • రెండేళ్లలో భారీగా పెరిగిన పెట్టుబడులు

న్యూఢిల్లీ : ఎల్‌ఐసి .. ఈ పేరు వింటే ప్రజలకే కాదు... దేశానికి కూడా ఒకప్పుడు ధీమాగా ఉండేది. అనిు ప్రధాన నగరాల్లోనూ ఎల్‌ఐసి నిధులతో నిర్మించిన కట్టడాలు ఉన్నాయి. సామాన్యులకు ఇంటి రుణాల నుండి దేశ ప్రణాళిక వ్యయానికి నిధులను సైతం ఎల్‌ఐసి సర్ధుబాటు చేసేది. చిన్న పట్టణాల్లో సైతం ఎల్‌ఐసి చేపట్టిన పనులు, భవనాలు కనిపించేవి. ప్రజల కోసమే ప్రస్థానాన్ని సాగించిన ఇంత ప్రతిష్టాత్మక సంస్థ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా కార్పొరేట్‌ బాట పడుతోంది. ఆ సంస్థలోనిదేశ ప్రజల కష్టార్జితం ఇప్పుడు అదాని పాలవుతోంది. ఒకవైపు మ్యూచువల్‌ ఫండ్లు సైతం అదాని గ్రూపునకు ముఖం చాటేస్తుండగా ఎవరు ఆదేశించారో, ఏ స్థాయిలో నిర్ణయం జరిగిందో కానీ ఎల్‌ఐసి పెట్టుబడులు మాత్రం పోటెత్తుతున్నాయి. ఆ సంస్థలో 2020లో ఒక శాతం కనాు తక్కువగా ఉన్న పెట్టుబడులను 2022 సెప్టెంబర్‌ నెలాఖరుకు 4.02శాతానికి ఎల్‌ఐసి పెంచింది. నవంబర్‌ నెలాఖరుకు పెట్టుబడుల ప్రవాహం మరింతగా పెరిగింది. సెప్టెంబర్‌ నెలాఖరుకు అదాని గ్రూపులో 62,801 కోట్ల రూపాయలుగా ఉను ఎల్‌ఐసి పెట్టుబడులు నవంబర్‌ నెలాఖరుకు 74,142 కోట్ల రూపాయలకు చేరాయి. ఇది అదానిగ్రూపు మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (18.98 లక్షల కోట్ల రూపాయలు)లో 3.9 శాతం. ఇంత పెద్ద మొత్తంలో అదాని సంస్థకు పెట్టుబడులను మళ్లించడంపై మార్కెట్‌ నిపుణులలో సైతం విస్మయం వ్యక్తమౌతోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, ఆదానికి మధ్య నెలకొను సంబంధాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఎల్‌ఐసి నుండి నిధులు పోటెత్తడం గమనార్హం.

  • పెట్టుబడుల ప్రవాహం ఇలా...

సెప్టెంబర్‌ 2020 నుండి ఆదాని గ్రూపులో ఎల్‌ఐసి పెట్టుబడులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అదానికి చెందిన ఏడు లిస్టెడ్‌ కంపెనీల్లో కనీసం నాలుగింటిలో ఇలా ఎల్‌ఐసి భారీ పెట్టుబడులు పెడుతోంది. వీటిలోని ఒక సంస్థలోకి ఎకంగా ఆరు రెట్ల మొత్తానిు ఎల్‌ఐసి తరలించింది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ఎల్‌ఐసి పోర్టుఫోలియో విలువ 9.3 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేయగా అందులో కనీసం 7.8 శాతం మొత్తానిు అదాని సంస్థలోకి తరలించినట్లు అంచనా! అదానిగ్యాస్‌లో సెప్టెంబర్‌ 2020 నాటికి ఒక్క శాతానికనాు తక్కువగా ఎల్‌ఐసి పెట్టుబడులు ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 5.77 శాతానికి చేరాయి. అదాని ట్రాన్స్‌మిషన్‌లో 2.42శాతం నుండి 3.46 శాతానికి పెరిగాయి. అదాని గ్రీన్‌ ఎనర్జీలో ఒక్క శాతం కనాు తక్కువ నుండి 1.5శాతానికి చేరాయి. అదానిపోర్ట్సులో 9.61శాతానికి ఎల్‌ఐసి పెట్టుబడులు పెరిగాయి. ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి కారణం ఏమిటో అర్ధం కావడం లేదని ఒక కార్పొరేట్‌ సలహాదారుడు వ్యాఖ్యానించడం గమనార్హం.

  • పారదర్శకత ఉందా...?

జీవిత బీమా సంస్థగా ఎల్‌ఐసికి పాలసీ దారుల ప్రయోజనాలే అత్యంత కీలకం కావాలి. ఈ దిశలో ఆ సంస్థ ప్రయాణం సాగుతుందో లేదో నిర్ధారించాలంటే ఎల్‌ఐసి పెట్టే పెట్టుబడులు పారదర్శకంగా ఉండాలి. కొంత కాలంగా ఈ పారదర్శకత లోపిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. అదానిఎంటర్‌ ప్రైజేస్‌ లిమిటెడ్‌లో ప్రతి మూడు నెలలకు ఎల్‌ఐసి పెట్టుబడులు పెంచుకుంటూ పోతోంది. ఇలా ఎందుకు చేస్తునాురను ప్రశ్నకు మాత్రం ఆ సంస్థ నుండి జవాబు రావడం లేదు. అదాని గ్రూపు మాత్రం కొన్ని సంవత్సరాలుగా తాము అన్ని రంగాల్లో విస్తరిస్తునాుమని అందువల్లే పెట్టుబడిదారులు తమ పట్ల ఆసక్తి చూపుతున్నారని అంటోంది. అయితే, ఆగస్టులో కార్పొరేట్‌ సంస్థల రుణాలను అధ్యయనం చేసే క్రెడిట్‌ సైట్స్‌ సంస్థ ఇచ్చిన నివేదికలో ఆదానిగ్రూపు భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయినట్లు పేర్కొను సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి మరింత పెరిగి ఆదాని సంస్థ రుణాల ఊబిలో కూరుకుపోతే దాని ప్రభావం ఎల్‌ఐసి పై కూడా పడే అవకాశం ఉందను ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకును వాటాల విక్రయ నిర్ణయం కూడా ఎల్‌ఐసికి నష్టాలను తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే !