ప్రజాశక్తి-జగ్గయ్యపేట : లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జెఏసీ ఆధ్వర్యంలో ఎల్ఐసి ఏజెంట్ల దీర్ఘకాలిక సమస్యలు, పాలసీదారులు ప్రయోజనాలు కోరుతూ జగ్గయ్యపేట బ్రాంచ్ లైఫ్ ఇన్సూ రెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (లియాఫి) జేఏసీ చైర్మన్ గరిణే మురళీకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం జగ్గయ్యపేట ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం ఎదుట గేట్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఏజెంట్లు తమ కార్యకలాపాలాలను బహిష్కరించి కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ గరిణే మురళి కృష్ణ, పీసీ వెంగళరావులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ ఏజెంట్గ అసోసియేషన్లు అన్ని కలిసి జేఏసీగా ఏర్పడి ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక ఉద్య మాన్ని చేపట్టినట్లు తెలిపారు. పాలసీలపై బోనస్ పెంచాలని వడ్డీరేట్లను తగ్గించాలని, ఐదేళ్లకు పైబడి లాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించాలని కస్టమర్లకు సమర్థవంతమైన సేవలు అందించా లని డిమాండ్ చేశారు. అన్ని బ్రాంచీలలో సిటిజన్ చార్టర్ ను ప్రదర్శించాలని, సంస్థ కు వెన్నుదన్నుగా నిలిచిన ఏజెంట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, ఎల్ఐసి లో వినియోగదారులకు పాలసీ సర్వీస్ రేటింగ్ ఇచ్చే అవకాశం కల్పించాలని, ఎల్ఐసి లో ఒకేసారి పాలసీ దారుడు కేవైసీ సమర్పించేలా చూడాలని, పోస్టల్ ప్రింటెడ్ బాండ్స్ నిలిపివేయాలని, ఏజెంట్లకు ఇచ్చే అడ్వాన్సులపై వడ్డీ రేట్లు తగ్గించా లని, డైరెక్ట్ ఏజెంట్లకు ప్రత్యేక రాయితీలు, ప్రయోజనాలు కల్పించాలని, ఏజెంట్ల పిల్లలకు విద్యా రుణ ఇవ్వాలని, గ్రాట్యుటీ లెక్కింపు విధానాన్ని సవరించి గ్రాట్యుటీ మొత్తాన్ని పెంచాలన ప్రతి ఏజెంట్ కు గ్రూప్ మెడిక్లయిమ్ పెంచాలని, కాంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం అమలుచేయాలని, పాలసీదారుల ప్రీమియం పై జీఎస్టీ అని ఎత్తివేయాలని తదితర డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి టీవీ సదాశివరావు, ఉపాధ్యక్షులు టి నరేంద్ర, ఎన్ గంగాధర్, సిహెచ్ సంజీవరావు, నాగ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలు కొండయ్య, సీతారామ య్య, కోశాధికారి ఎస్ మధుబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మకంటి ప్రసాద్, ఏజెంట్లు పాల్గొన్నారు.










