Dec 01,2020 12:07

న్యూఢిల్లీ : లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా యుపి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకురావడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్‌ మదన్‌ లోకూర్‌ అన్నారు. ఈ చట్టం వ్యక్తిగత  ఎంపిక, గౌరవం, మానవ హక్కులను హరిస్తుందని అన్నారు. వివాహాలు విశ్వాసం మీద ఆధారపడి జరుగుతాయని, వీటిని గౌరవిస్తూ సుప్రీంకోర్టు న్యాయశాస్త్రాన్ని అభివృద్ధి చేసిందని అన్నారు. ఈ నూతన ఆర్డినెన్స్‌ సుప్రీంకోర్టు చట్టాలను ఉల్లంఘిస్తాయని అన్నారు. ప్రజలు ఈ చట్టాలకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. 2018లో హదియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. మేజరైన యువతి తన ఇష్టానుసారం ముస్లిం మతంలోకి మారవచ్చని, ఆ వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు రూపొందించిన చట్టాల ఉద్దేశం స్పష్టమైన నిర్వచనం లేని లవ్‌జిహాద్‌ వంటి అంశాలను నిషేధించడమేనని అన్నారు. లవ్‌జీహాద్‌ను ఆమోదిస్తే.. ఇతర కమ్యూనిటీల్లో కూడా ఇలాంటి చట్టాలే వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు.