ప్రజాశక్తి - గోరంట్ల : లోకేష్ పాదయాత్రకు ప్రజాదరణ పెరగడంతో దీన్ని ఓర్వలేక ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శించారు ఈ సందర్భంగా పట్టణంలో సిటిసి థియేటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు సమయానికి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. అభివృద్ధిని గాలికి వదిలిన ప్రభుత్వం నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర అడ్డుకునేందుకు ఎన్నో కుటీల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. వైసిపి ఎంపీలు 23 మంది ఉన్నా కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. పాద యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే రెట్టింపుతో ఉత్సాహంతో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఇప్పటికైనా పాదయాత్రకు అడ్డంకులు సృష్టించకుండా యాత్ర సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ కన్వీనర్ సుబ్రహ్మణ్యం, నాయకులు శ్రీధర్, నరేష్, శ్రీనివాసులు, రఘునాథ్ రెడ్డి, కిష్టప్ప, శ్రీనివాసులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు










