హైకోర్టు న్యాయమూర్తికి స్వాగతం పలుకుతున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్
లేపాక్షి : ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన లేపాక్షికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద శనివారం విచ్చేశారు. ఈయన్ను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ కలిసి స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. దుర్గా వీరభద్ర పాపాన్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అధికారులు లేపాక్షి విశిష్టత, కట్టడాలు, శిల్ప కళావైభవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బాబు, సిఐ వేణుగోపాల్, ఎస్‌ఐ మునీర్ అహమ్మద్, ఇఒ నరసింహమూర్తి ఉన్నారు.










