May 06,2023 22:50

b.soujanya

కృష్ణచైతన్య ప్రభంజనం
ప్రజాశక్తి-విజయవాడ
పదో తరగతి పరీక్షల్లో విజయవాడ కృష్ణలంకలోని కృష్ణచైతన్య స్కూలు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారని ప్రిన్సిపల్‌ ఎల్‌.ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. తమ పాఠశాల విద్యార్థిని బి.సౌజన్య 591/600 మార్కులు సాధించిందని చెప్పారు. సిహెచ్‌ వెంకట నందిని 577, ఎండి షహనావాజ్‌ 572 మార్కులు సాధించారని వివరించారు. 24 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు వచ్చాయని తెలిపారు. ఏటేటా తమ విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణతా శాతం సాధిస్తున్నారన్నారు. కృష్ణలంక ప్రాంతంలో తమ విద్యార్థులు తిరుగులేని విజయాలను సాధిస్తున్నారని తెలిపారు. పట్టుదలతో చదివితే అత్యధిక మార్కులు వస్తాయని తమ విద్యార్థులు ఆచరణలో చూపించారని ఆయన తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు.