కరాటే గ్రేడింగ్ టెస్టు నిర్వహిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : కరాటే వల్ల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవచ్చని మల్టీస్టార్ ఆలిండియా బుడోఖాన్ కరాటే అకాడమి కరాటే మాస్టర్ ఇనాయతా బాషా పేర్కొన్నారు. స్థానిక కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నతపాఠశాల ఆవరణంలో ఆదివారం మల్టీస్టార్ ఆలిండియా బుడోఖాన్ కరాటే అకాడమి ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్టు నిర్వహించారు. ఈ టెస్టులో 80 మంది విద్యార్థులు పాల్గొనగా ఇందులో 65 మంది విద్యార్థులు ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ బ్రౌన్ బెల్టులు సాధించారని కరాటే మాస్టర్ తెలిపారు.










