ప్రజాశక్తి -పొదలకూరు :టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లిలో సోమవారం నిరసన జరిగింది. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లిఖార్జున నాయుడు, కోవూరు వెంకటేశ్వర్ల నాయుడు, కొమ్మి చిరంజీవి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కొవ్వుత్తులతో నిరసన ప్రదర్శ నిర్వహించారు. మల్లికార్జున్ నాయుడు, కొమ్మి చిరంజీవి నాయుడు మాట్లాడుతూ ఎలాంటి ఆధారాల్లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. చంద్రబాబు విజన్‌తోనే అనేక మంది యువత మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. కార్యక్రమంలో కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, షేక్ జమీర్ భాష, బెల్లంకొండ మస్తాన్ నాయుడు, గొర్ల వెంకటేశ్వర్లు నాయుడు, కామినేని మల్లికార్జున నాయుడు, వడ్లమూడి వెంకయ్య నాయుడు, కొమ్మి సుబ్బారావు, మద్దిరెళ్ళ నరసింహులు యాదవ్, కర్రీయావుల శ్రీనివాసులు నాయుడు, దేవినేని సుబ్బానాయుడు, వేంపులూరు అరుణమ్మ, ఉన్నారు.










