Jan 13,2021 13:08

కంచికచర్ల (కృష్ణా) : నేడు భోగి పండుగను పురస్కరించుకొని.. నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల, నందిగామ, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో యథేచ్ఛగా కోడిపందేల నిర్వహణకు బరులను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. కోడి పందాల బరుల దగ్గరే మూడుముక్కలాట, పేకాట, గుండాటలతోపాటు యథేచ్ఛగా మద్యం విక్రయాలు కొనసాగుతోన్నాయి. కోడి పందేల సందర్భంగా.. కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుండి కోడిపందేలు కొనసాగనున్నాయి. కోడి పందేల నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నప్పటికీ కోడిపందేలకు రంగం మాత్రం సిద్ధమవుతోంది.