ఫొటో : మాట్లాడుతున్న వ్యవసాయ సంచాలకులు వి.దేవసేనమ్మ
కొనుగోలు కేంద్రాలపై అవగాహన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు పట్టణంలోని పంటవీధి సచివాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ సంచాలకులు వి.దేవసేనమ్మ హాజరై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు ఉపయోగించుకోవాలని కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం ద్వారా అమ్ముకునే ప్రక్రియను పాటించాలని రైతులకు సూచించారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ కనీస మద్దతు ధర వివరాలు వరి ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా అమ్మే ప్రక్రియను రైతులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.










