ప్రజాశక్తి-నెల్లూరు :మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, కోర్టులో తమ నాయకుడికి న్యాయం జరగాలని ఆశిస్తూ టిడిపి నాయకులు నగరంలోని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం నగరంలోని రంగనాయకుల పేటలో గల తల్పగిరి రంగనాధ స్వామి దేవస్థానంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టిడిపి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వేసిన పిటీషన్ల విషయంలో చంద్రబాబుకు న్యాయం జరగాలని రంగనాథ స్వామిని కోరు కున్నట్లుగా ఆయన తెలిపారు. తమ నాయకుడు చంద్రబాబు కడిగిన ముత్యం లా బయటకు వస్తారని ఆశిస్తున్నామన్నారు. టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. దేశం మొత్తం వ్యతిరేకిస్తుందన్నారు. చివరకు న్యాయం గెలుస్తుందన్నారు. రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టు, జైల్లో వసతుల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వంద దేశాల్లో ఉన్న కోట్లాది తెలుగు ప్రజలు బయటకు వచ్చి నిరసనలు తెలిపారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నిర్బంధాలను అక్రమ కేసులను, లాఠీలను, తూటాలను ఎదుర్కొంటూ జనసేన. కమ్యూనిస్టు పార్టీలు టిడిపితో కలిసి చంద్రబాబుకు అండగా నిలుస్తున్నాయన్నారు. మాజీ శాసనసభ్యులు కురుగుండ్ల రామక్రిష్ణ, పాసిం సునీల్ కుమార్, కొమ్మి లక్ష్మి నాయుడు, కావలి నియోజకవర్గ ఇంఛార్జి మాలెపాటి సుబ్బానాయుడు, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు జెన్నీ రమణయ్య, రాజా నాయుడు, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ మంగళవారం టిడిపి జిల్లా కార్యాలయం వద్ద కొనసాగిస్తున్న పార్టీ రిలేనిరసన దీక్షలో మాజీ మంత్రి నారాయణ పాల్గొని మాట్లాడారు. కూల్‌డ్రింక్స్ అందజేసి దీక్షను విరమింపచేశారు. త్వరలో చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తో పాటు నియోజవర్గ పరిశీలకులు షేక్ కరిముల్లా, నగర అధ్యక్షులు మామిడాల మధు, అనురాధ,విజేత,టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










