Sep 16,2023 20:45

మాట్లాడుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సరికాదంటూ వైసిపి కార్యకర్తలే చర్చించుకుంటున్నారని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ, కందుకూరులోని పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం కూడా కొనసాగాయి. నాలుగో రోజు దీక్షలో లింగసముద్రం మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుకి పార్టీలకతీతంగా మద్దతు ప్రకటిస్తున్నారని, ఎక్కడ చూసినా వివిధ వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారన్నారు. కందుకూరు నియోజకవర్గంలో వైసిపి నాయకులు గద్దల్లా మారి ఇసుక, మట్టి దోచుకుంటున్నారని, ఇదంతా స్థానిక శాసనసభ్యుడు కనుసన్నల్లోనే జరుగుతోందని నాగేశ్వరరావు ఆరోపించారు. లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు, కందుకూరు పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, విశ్వనాధపురం సర్పంచ్‌ బొల్లినేని నాగేశ్వరరావు, నియోజకవర్గ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ నాయబ్‌ రసూల్‌, లింగసముద్రం మండల నాయకులు గాలంకి ప్రసాద్‌, పూరిమిట్ల మాల్యాద్రి, అడపా రంగయ్య, అడపా నరసయ్య, మద్దెల రామారావు, నీలం బ్రహ్మారెడ్డి, బోయిళ్ళ కొండప నాయుడు, ముప్పరాజు లక్ష్మీనరసింహం, ఉన్నం వీరాస్వామి, సోంపల్లి మనోహర్‌, కిలారి కొండయ్య, పొంకం బ్రహ్మయ్య, నారిబోయిన నారాయణ, ఉట్లపల్లి మాధవరావు, ఉన్నారు.