దీక్షలో పాల్గొన్న నాయకులు
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
ప్రజాశక్తి-కావలి:కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు గురువారం రెండవరోజు కొనసాగాయి.నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ మాలేపాటి సుబ్బా నాయుడు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కావలి రూరల్ మండల, పట్టణ పార్టీ శ్రేణులు దీక్షలో ఆయనతో కలిసి కూర్చున్నారు.మాజీ ముఖ్యమంత్రి వర్యులు, టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా... రెండవ రోజు దీక్షలో తెలుగుదేశం పార్టీ నాయ కులు, కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా తరలివచ్చారు.అక్రమంగా అరెస్టు చేసిన బాబుని వెంటనే విడుదల చేయాలి'', ''సీఎం డౌన్ డౌన్'', ''చేతకాని సీఎం దిగిపోవాలి'', ''సైకో పోవాలి- సైకిల్ రావాలి'', ''తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి'', ''మాలేపాటి నాయకత్వం వర్ధిల్లాలి'' అంటూ కార్యాలయ ప్రాంగణం మారు మోగింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొట్లూరుశ్రీనివాసులు, గుత్తికొండ కిషోర్‌బాబు, పోతుగంటి అలేఖ్య, కమతం ప్రసాద్, మంచాలప్రసాద్, బూచి రవియాదవ్, తదితతులు పాల్గొన్నారు.










