ప్రజాశక్తి-వన్‌టౌన్
స్థానిక 49వ డివిజన్ లోని 168వ సచివాలయం పరిధిలో 79వ రోజు శనివారం గడపగడపకూ మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని టైలర్ పేటలోని వీరయ్య వీధి 1,2,3,4 లైన్లు, జోడుబొమ్మల రోడ్, తిరుమలయ్య వీధి తదితర ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రజలకు ఇల్లు ఇస్తాం అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాడన్నారు. నేడు జగనన్న వచ్చాక పేదలకు ఉచితంగా ఇల్లు ఇచ్చారన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో తెచ్చిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జి సుదీర్, బూదాల శ్రీను, యర్రజొన్న విజయలక్ష్మి, పల్లెపోగు ప్రసాద్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










